స్విట్జర్లాండ్ కి మారిన బాద్షా షూటింగ్

స్విట్జర్లాండ్ కి మారిన బాద్షా షూటింగ్

Published on Jul 24, 2012 11:37 AM IST


యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్టైలిష్ లుక్ లో చూపిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘బాద్షా’. ఇటలీలో మొదటి షెడ్యూల్ ప్రారంభించిన ఈ చిత్రం ఇటలీలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ ఇటలీ నుండి స్విట్జర్లాండ్ కి మారిందని సమాచారం. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కామెడీకి పెద్ద పీఠ వేస్తూ చిత్రాలను తీసే శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీను వైట్ల ఎన్.టి.ఆర్ ని ఇప్పటివరకూ చూపించని విధంగా ఈ చిత్రంలో చూపించనున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో రెండవసారి ఎన్.టి.ఆర్ సరసన కలిసి నటిస్తున్నారు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు