రాంబాబుతో ఫైట్ చేస్తున్న రానా బాబు.!

రాంబాబుతో ఫైట్ చేస్తున్న రానా బాబు.!

Published on Jul 24, 2012 8:13 AM IST


అవును మీరు విన్నది నిజమే రాంబాబుతో, రానా బాబు ఫైట్ చేయబోతున్నాడు. రానా బాబు అంటే హీరో రానా కాదండోయ్. విలక్షణ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘రాంబాబు’ అనే పాత్రలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అయన పాత్ర పేరు ‘రానా బాబు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోని సెవన్ ఎకర్స్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది. ఇటీవల షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు ఇంటర్నెట్లో విహరిస్తున్నాయి. ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ లుక్ చుసిన అభిమానులు మరో బద్రి అవబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు సరసన గంగ పాత్రలో తమన్నా హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 18న విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ సినిమాని యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు