యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’. ఈ చిత్రంలో శ్రీ హరి ఇంగ్లీష్ మాన్ గా కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి బాబా ఒరిజినల్ ఫోటో తీసిన ఘనత దక్కించుకున్న లార్డ్ వేల్స్ పాత్రని శ్రీహరి ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, శరత్ బాబు మరియు సాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నాగార్జునతో ‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ లాంటి సూపర్ హిట్ భక్తిరస చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు గారే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియోను జూలై 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.