‘కెవ్వు కేక’ అనబోతున్న అల్లరి నరేష్

‘కెవ్వు కేక’ అనబోతున్న అల్లరి నరేష్

Published on Jul 22, 2012 2:14 PM IST


ఈ మధ్య కాలంలో సినిమాల్లో బాగా క్రేజ్ వచ్చిన పేర్లను మరియు బాగా హిట్ అయిన పాటలోని మొదటి పదాలను తీసుకొని సినిమా టైటిల్స్ గా పెట్టి తమ సినిమాలకు క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అదే తరహాలో కామెడి హీరో ‘అల్లరి’ నరేష్ తదుపరి చిత్రానికి ‘కెవ్వు కేక’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ” నా తదుపరి చిత్రం ఖరారైంది, ఈ చిత్రానికి ‘కెవ్వు కేక’ అనే టైటిల్ ని ఖరారు చేశాము. ఈ చిత్రానికి దేవి ప్రసాద్ దర్శకత్వం వహిస్తారు’ అని నరేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దేవి ప్రసాద్ మరియు అల్లరి నరేష్ కాంబినేషన్లో వచ్చిన ‘బ్లేడ్ బాబ్జీ’ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలను అధికారికంగా త్వరలోనే తెలియజేయనున్నారు.

అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ జంటగా తెరకెక్కిన ‘సుడిగాడు’ చిత్రం ఆగష్టు చివరివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా ప్రస్తుతం నరేష్ ‘యాక్షన్’ మూవీ మరియు ఒక సోసియో ఫాంటసి చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తలు