ఈ వారాంతంలో (జూలై 27) విడుదల కానున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్న మంచు లక్ష్మీ మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో నటీనటుల కాస్ట్యూమ్స్ చాలా స్టైలిష్ గా ఉండాలని చాలా కష్ట పడ్డాం. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలలో అసలైన బంగారు నగలను మరియు ఖరీదైన కాస్ట్యూమ్స్ ఉపయోగించాము. ఈ చిత్రంలో మా అమ్మ నిర్మలా దేవి డిజైన్ చేసిన ఉప్పాడ చీరను కట్టుకొని నటించడం చాలా ఆనందంగా ఉంది. మిగతా కాస్ట్యూమ్స్ విషయాల్లో కూడా ఆమె సహాయం చేశారని’ ఆమె ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
మంచు మనోజ్ మరియు దీక్షా సేథ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక కీలక పాత్ర పోషించారు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రాజా దర్శకత్వం వహించారు.