“ఈగ” పైరసీ చేసినందుకు చిత్తూరు జిల్లాలో థియేటర్ సీజ్

“ఈగ” పైరసీ చేసినందుకు చిత్తూరు జిల్లాలో థియేటర్ సీజ్

Published on Jul 21, 2012 4:00 PM IST


ఆంద్రప్రదేశ్ యాంటి పైరసీ సెల్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ కలిసి ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” చిత్రాన్ని పైరసీ చేసిన గ్యాంగ్ ని పట్టుకున్నారు. జూలై 6న ఈ చిత్రం విడుదల అయ్యాక సురేష్ ప్రొడక్షన్స్ తిరుపతి ఎగ్జిక్యుటివ్ లక్ష్మణ్ రావు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం లో గౌరీ శంకర్ థియేటర్ వారు “ఈగ” చిత్ర పైరసీ చేస్తున్నారని ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసు వెంటనే రంగంలోకి దిగారు షో జరుగుతుండగానే షో ని ఆపించి థియేటర్ని సీజ్ చేశారు. థియేటర్ ఓనర్ ఇందులో తనకెటువంటి సంభంధం లేదు అని చెబుతుండగా నిజం ఏంటనేది పోలీసు వారి విచారణలో తెలుస్తుంది. యాంటి పైరసీ వారి సమాచారం మేరకు చిత్ర ప్రింట్లతో ఉంచిన కోడ్ ద్వారా ఎక్కడ నుండి పైరసీ జరిగిందో తెలిసిపోయిందని అని చెప్పారు.రెండవ షో తరువాత ఈ చిత్రాన్ని పైరసీ చేసి రాష్ట్రము నలుమూలలకు పంపిణి చేశారు. ఇదిలా ఉండగా నాని మరియు సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం రాష్ట్రంలో మరియు ఓవర్సీస్ లో అద్భుతమయిన కలెక్షన్లను రాబట్టుతుంది.

తాజా వార్తలు