దాదాపుగా పూర్తయిన సందీప్ కిషన్ “రొటీన్ లవ్ స్టొరీ”

దాదాపుగా పూర్తయిన సందీప్ కిషన్ “రొటీన్ లవ్ స్టొరీ”

Published on Jul 21, 2012 3:58 PM IST


సందీప్ కిషన్ మరియు రెగిన ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “రోటీన్ లవ్ స్టొరీ” చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రం ఆదిలాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర ప్యాచ్ వర్క్ చివరి దశల్లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఈ చిత్ర బృందం రిషికేశ్ లో చిత్రీకరణ జరుపుతుండగా ప్రధాన నటులు దాదాపుగా మునిగిపోయే పరిస్థితి ఎదురయ్యింది అక్కడ చిత్రీకరణ ముగించుకున్న తరువాత సందీప్ “గుండెల్లో గోదారి”, యారుడ మహేష్ మరియు రాజ్ – డి కే చిత్రాలలో పాల్గొంటూ వచ్చారు. ప్రస్తుతం సందీప్ డేట్స్ ఖాళి ఉండటం మూలాన ప్రవీణ్ సత్తారు ఈ చిత్ర చిత్రీకరణ ముగించేయలనుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం బాగా ఆలస్యమయ్యింది. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

తాజా వార్తలు