మిల్క్ బ్యూటీ తమన్నా ఒక అద్భతమైన పాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఏంటంటే ‘అరుంధతి’ చిత్రంలో అనుష్క చేసిన పాత్ర లాంటి అద్భుతమైన పాత్ర చేయాలనుకుంటోంది. తమన్నా గతంలో చేసిన ‘ఊసరవెల్లి’ మరియు ‘100% లవ్’ చిత్రాల ద్వారా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయగలదు అని నిరూపించుకుంది. అందం మరియు అభినయం కలగలిసిన ఈ భామ అలాంటి అవకాశం తెచ్చిపెట్టే కాలం కోసం వేచి చూస్తోంది.
ఇదే విషయాన్ని తమన్నాని అడిగితే దానికి సమాధానమిస్తూ ” అలాంటి పాత్రల కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను కానీ అలాంటి పాత్రల కోసం నాకు నేనుగా వెతకడం లేదు. ఆ సమయం వస్తే అవే ఎతుక్కుంటూ వస్తాయి. నాతో సినిమాలు చేసే దర్శకులు మరియు నిర్మాతలు నా దగ్గరకి అలాంటి పాత్రలు తీసుకొచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నాను” అని ఆమె అన్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మరియు ప్రభాస్ సరసన “రెబల్’ చిత్రాల్లో నటిస్తున్నారు.