చివరి దశకు చేరుకున్న ‘రెబల్’ షూటింగ్

చివరి దశకు చేరుకున్న ‘రెబల్’ షూటింగ్

Published on Jul 18, 2012 5:39 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ” రెబల్ ” చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది మరియు ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగతా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ పాటను చిత్రీకరించి ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయాలని ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరిలో ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మరియు ఈ సన్నివేశాలు కొద్ది రోజుల్లో పూర్తవుతాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామలు తమన్నా మరియు దీక్షా సేథ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని జె. భగవాన్ మరియు జె. పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రం నుండి తప్పుకోవడం వల్ల లారెన్స్ ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తున్నారు. ‘రెబల్’ చాలా కాలంగా ప్రొడక్షన్ దశలోనే ఉంది. ‘రెబల్’ స్టైలిష్ మరియు హై వోల్టేజ్ ఎంటర్టైనర్ మూవీ అని రాఘవ లారెన్స్ అన్నారు.

తాజా వార్తలు