చిత్రీకరణ మొదలు పెట్టుకున్న శర్వానంద్ “కో అంటే కోటి”

చిత్రీకరణ మొదలు పెట్టుకున్న శర్వానంద్ “కో అంటే కోటి”

Published on Jul 17, 2012 4:02 AM IST


శర్వానంద్ తన రాబోతున్న చిత్రం “కో అంటే కోటి” చిత్ర చిత్రీకరణ మొదలుపెట్టుకున్నారు. గతంలో “ఆవకాయ బిర్యాని” చిత్రానికి దర్శకత్వం వహించిన అనిష్ కురువిల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శర్వానంద్ స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రియా ఆనంద్ ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుందని సమాచారం. త్వరలో ఈ చిత్ర బృందంతో ఈ నటి కలవనున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. తన గత చిత్రం “నువ్వా – నేనా” పరాజయం పొందిన తరువాత శర్వానంద్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రం కాకుండా చేరన్ చేస్తున్న ద్విభాషా చిత్రంలో కూడా శర్వానంద్ కనిపించనున్నారు.

తాజా వార్తలు