కేన్స్ లో మంచు విష్ణు

కేన్స్ లో మంచు విష్ణు

Published on May 17, 2012 8:56 PM IST

విష్ణు మంచు కొద్ది రోజులు విరామం తీసుకొన్నారు ప్రస్తుతం తనకి దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ లో కేన్స్ లో ఉన్నారు. అక్కడ జరుగుతున్న కేన్స్ 65 ఫెస్టివల్ లో పాల్గోనన్నున్నారు ఆయన ఈ విషయం మీద చాల సంతోషంగా ఉన్నట్టు తెలిస్తుంది. “కేన్స్ లో ఉన్నాను ఇదే మొదటిసారి ఫిలిం ఫెస్టివల్ కి రావటం. ప్రతి సినిమా ప్రేమికుడు దీనికి హాజరు కావాలనుకుంటాడు” అని మంచు విష్ణు ట్విట్టర్ లో అన్నారు. విష్ణు తన రాబోతున్న చిత్రం “దేనికయినా రెడీ” లో రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. జి నాగేశ్వర రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో హన్సిక ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రం కూడా “ఢీ” చిత్రం లానే హాస్యం పంచె చిత్రంగా మలుస్తున్నారు. ఈ వేసవి లోనే ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు