నాకు పెళ్లి కుదరలేదు -అల్లు శిరీష్

నాకు పెళ్లి కుదరలేదు -అల్లు శిరీష్

Published on May 15, 2012 8:41 PM IST

ఈరోజు అల్లు శిరీష్ త్వరలో ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు పలు మీడియా వారు ప్రచురించారు రాబోయే ఏడాది వీరి పెళ్లి ఉండబోతుందని ఇరు కుటుంభాలు ఈ పెళ్ళికి అంగీకరించాయని కూడా ప్రకటించారు. దీనికి స్పందనగా అల్లు శిరీష్ ఇలా ట్వీట్ చేశారు “నాకు ఇంకొక ,మూడు నాలుగేళ్ళ వరకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. నన్ను ఇలా ఉండనివ్వండి ఆ అమ్మాయి నాకు సోదరి వంటిది ఎలా పెళ్లి చేసుకుంటాను చెప్పండి గతంలో కూడా ఇలానే అన్నారు నాకు దీనివల్ల పోయేదేమీ లేదు కాని ఆ అమ్మాయి గురించి కాస్త ఆలోచించండి ఇలాంటి విషయాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించండి” అని అన్నారు. ప్రస్తుతం ఈయన తన సినిమా కెరీర్ మీదీ దృష్టి సారించారు. త్వరలో రాధామోహన్ దర్శకత్వంలో “గౌరవం” చిత్రంలో తెరంగేట్రం చెయ్యనున్నారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు