అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ గురించి పొగుడుతున్న టాలీవుడ్ సెలబ్రిటీలు

అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ గురించి పొగుడుతున్న టాలీవుడ్ సెలబ్రిటీలు

Published on May 6, 2012 9:07 PM IST

బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ బుల్లె తెర మీద అడుగుపెట్టాడు. ‘సత్యమేవ జయతే’ అంటూ ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రోగ్రాం లోని మొదటి భాగం ఈ రోజే ప్రారంభమైంది. స్టార్ ప్లస్ మరియు దూరదర్షన్ చానల్స్ లో ఈ ప్రోగ్రాం ప్రసారం చేయగా విశేష ఆదరణ లభించింది. అమీర్ ఖాన్ ప్రోగ్రాం అవడంతో ఒక్కసారిగా పేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఒక్కసారిగా ప్రభంజనంలా వ్యాపించింది. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ప్రోగ్రాం చూసి తమ అభిప్రాయం వ్యక్తం చేసారు.

శృతి హాసన్ : అమీర్ వంటి గొప్ప నటుడు చేస్తున్న ప్రోగ్రాం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా అధ్బుతంగా చేసి చూపించారు.

గోపి మోహన్ : అమీర్ ఖాన్ వంటి నటుడికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ చూస్తుంటే సెల్యూట్ చేయాలనిపిస్తుంది.

అల్లు శిరీష్ :అమీర్ ఖాన్ చేసిన ప్రోగ్రాం గురించి గొప్పగా విన్నాను. బయట ఉండటంతో ఈ ప్రోగ్రాం చూడలేకపోయాను. తెలుగులో కూడా ఈ ప్రోగ్రాం డబ్ చేయబోతున్నారని తెల్సింది.

ఇంకా తషు కౌశిక్, నీలిమ తిరుమలశెట్టి, సౌమ్య, రాహుల్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ ప్రోగ్రాం అధ్బుతంగా ఉందంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు