విరామం లేకుండా గడుపుతున్న త్రిష

విరామం లేకుండా గడుపుతున్న త్రిష

Published on May 5, 2012 10:54 PM IST

త్రిష ఈ మధ్య విరామం లేకుండా గడుపుతుంది. తెలుగు మరియు తమిళంలో చిత్రాలతో త్రిష బిజీగా మారిపోయింది. మరిన్ని చిత్రాలలో ఆమెను నటింప చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దమ్ము చిత్రం తరువాత ఈ భామ రవితేజ సరసన “సార్ వస్తారు” చిత్రం లో నటిస్తున్నారు. తమిళం లో విశాల్ సరసన “సమర” అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు ఇవి కాకుండా జీవా సరసన తమిళంలో “ఎండ్రేండ్రుం పున్నగై” చిత్రంలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం “భూలోగం” అనే చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. జయం రవి ప్రధాన పాత్రలో రాబోతున్న ఈ చిత్రంలో మొదటగా నయనతారను అనుకున్నారు. నయనతార అజిత్ మరియు విష్ణువర్ధన్ చిత్రంలో చెయ్యటం మూలాన త్రిష ఈ పాత్రను దక్కించుకుంది. కెరీర్ మొదలు పెట్టి పదేళ్ళయినా త్రిషకి ఇంత డిమాండ్ ఉండడం మంచి పరిణామం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు