జూన్ లో రానున్న సుడిగాడు

జూన్ లో రానున్న సుడిగాడు

Published on May 5, 2012 1:32 PM IST


అల్లరి నరేష్ ,మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “సుడిగాడు” చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. కొన్ని ప్రముఖ చిత్రాలకు ఇది వ్యంగాస్త్రం కాబోతుంది. ఈ చిత్ర శీర్షిక కూడా “ఒక టికెట్ పై 100 సినిమాలు”. ఈ చిత్రం మొత్తం హైదరాబాద్ లో చిత్రీకరించారు. ఈ మధ్యనే అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ సాంగ్ ని 45 డాన్సర్లు మరియు మూడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో చిత్రీకరించారు.అలరి నరేష్,మోనాల్ గజ్జర్ మరియు రచన మౌర్య ల మీద చిత్రీకరించిన మరో పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. చిత్రంలో ఒక పాట మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి.చంద్రశేఖర్ రెడ్డి అరుంధతి ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. శ్రీ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో ఈ నెలలోనే విడుదల కానుంది ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చెయ్యాలని నిర్మాత భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు