స్థిరమయిన వసూళ్లను సాదిస్తున్న “దమ్ము”

స్థిరమయిన వసూళ్లను సాదిస్తున్న “దమ్ము”

Published on May 3, 2012 1:25 AM IST

యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన “దమ్ము” చిత్రం వసూళ్లు పలు చోట్ల స్థిరంగా ఉన్నాయి పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ వసూళ్లు ఇలానే సాగితే చిత్రం వాణిజ్య పరమయిన విజయం సాదిస్తుంది అనే చెప్పాలి. ఇప్పటివరకు చిత్రం మంచి వసూల్లనే సాదిస్తూ వచ్చింది కాని డిస్ట్రిబ్యుటర్ కి భారీ లాభం వస్తుందా లేదా అనేది చూడాలి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కే ఏ వల్లభ నిర్మించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. కార్తీక మరియు త్రిష కథానాయికలుగా నటించిన “దమ్ము” చిత్రం గత వారం భారీగా విడుదలయ్యింది. ఈ చిత్రం ఇప్పటి వరకు మంచి వసూళ్లతోనే నడుస్తుంది. దరిదాపుల్లో ఎటువంటి భారీ బడ్జట్ చిత్రం లేకపోవటం కూడా ఈ చిత్ర వసూళ్ళకి తోడ్పడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు