గుమ్మడి కాయ కొట్టిన గబ్బర్ సింగ్!

గుమ్మడి కాయ కొట్టిన గబ్బర్ సింగ్!

Published on May 2, 2012 5:34 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం యూరప్లో జరుగుతుండగా ఈ రోజే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. దిల్ సే పాట చిత్రీకరణ పూర్తవడంతో షూటింగ్ మొత్త పూర్తయింది. ఈ పాట కోసం ఒక పనోరమిక్ అనే ట్రైన్ ప్రత్యేకంగా తీసుకుని చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ షూటింగ్ పూర్తయినట్లు తన ట్విట్టర్ అకౌంటులో తెలిపింది. ఈ నెల 4 లేదా 5 తేదీల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే రెండవ వారంలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది. దెవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా బండ్ల గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు