సీడెడ్లో గబ్బర్ సింగ్ పంపిణీ హక్కులు దక్కించుకున్న శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

సీడెడ్లో గబ్బర్ సింగ్ పంపిణీ హక్కులు దక్కించుకున్న శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

Published on May 2, 2012 10:19 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతుండగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా సినిమా అభిమానులని కూడా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే దాదాపు చాలా ఏరియాల్లో బిజినెస్ కూడా ప్రారంభం అయింది. ఇటీవలే విడుదలైన ఇష్క్ చిత్రాన్ని సీడెడ్ ఏరియాలో కొనుగోలు చేసిన శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ గబ్బర్ సింగ్ పంపిణీ హక్కులు కూడా దక్కించుకున్నారు. చిత్తూరు, కర్నూలు, బళ్ళారి ఏరియాల్లో పంపిణీ హక్కులకు గాను 3.60 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం యూరప్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు