శౌర్యం శివ డైరెక్షన్లో అజిత్

శౌర్యం శివ డైరెక్షన్లో అజిత్

Published on May 1, 2012 2:15 PM IST


శౌర్యం, శంఖం వంటి తెలుగు చిత్రాల దర్శకుడు శివ అజిత్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కొట్టాడు. కార్తి హీరోగా సిరుతై అనే సినిమా డైరెక్ట్ చేసిన శివ ప్రస్తుతం రవితేజ హీరోగా ‘దరువు’ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అజిత్ కూడా బిల్లా 2 చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర పాటలు ఈ రోజే విడుదలయ్యాయి. ఈ రోజు అజిత్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రముఖ తమిళ వార్త పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ డైరెక్షన్లో చేయనున్నట్లు ధ్రువీకరించాడు. బిల్లా 2, దరువు విడుదలయ్యాక ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు