ఈ నెలలో అమెరికా వెళ్లనున్న ‘రేయ్’ చిత్ర యూనిట్

ఈ నెలలో అమెరికా వెళ్లనున్న ‘రేయ్’ చిత్ర యూనిట్

Published on May 1, 2012 9:49 AM IST


వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రేయ్’ చిత్రం త్వరలో అమెరికా వెళ్లనుంది. చాలా రోజుల నుండి షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం ఒక భారీ షెడ్యుల్ కోసం విదేశాలకు వెళ్ళే సన్నాహాల్లో ఉంది. సాయి ధర్మ తేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా దాస్, సైయామి ఖేర్ హీరొయిన్ గా నటిస్తున్నారు. మ్యూజికల్ లవ్ స్టొరీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అమెరికా లోని లాస్ వేగాస్ మరియు ఇతర ఏరియాల్లో చిత్రీకరించనున్నారు. గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ రేయ్ చిత్రానికి చక్రి సంగీతం అందించాడు. గతంలో వైవిఎస్ మరియు చక్రి కాంబినేషన్లో వచ్చిన మ్యూజికల్ లవ్ స్టొరీ ‘దేవదాస్’ ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. రేయ్ చిత్రం కూడా ఆ స్థాయి విజయం సాధిస్తుందని వైవిఎస్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని వైవిఎస్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు