ఋషి దర్శకుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

ఋషి దర్శకుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

Published on May 1, 2012 8:38 AM IST


ఇటీవలే విడుదలైన ‘ఋషి’ సినిమాకి దర్శకత్వం వహించిన రాజ్ మాదిరాజు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గెల్చుకున్నాడు. త్వరలో జరగనున్న ఈ వేడుకలో రాజ్ ఉత్తమ నూతన దర్శకుడి అవార్డు గెల్చుకున్నాడు. ఎమ్బీబీఎస్ చదివే ఋషి అనే ఒక యువకుడి కథతో తెరకెక్కిన చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా అనుకున్న స్థాయి విజయం సాధించలేనప్పటికీ చుసిన ప్రతి ఒక్కరినీ మెప్పించగలిగింది. ఋషి పాత్రలో అరవింద్ కృష్ణ నటించగా అతనికి జోడీగా సుప్రియ శైలజ నటించింది. అవయవ దానం నేపధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రమేష్ ప్రసాద్ గారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు