“ఎందుకంటే ప్రేమంట” చిత్ర ఆడియో విడుదల వేదిక ఖరారు

“ఎందుకంటే ప్రేమంట” చిత్ర ఆడియో విడుదల వేదిక ఖరారు

Published on Apr 28, 2012 7:18 PM IST


రామ్ ,తమన్నా లు ప్రధాన పాత్రలలో నటించిన “ఎందుకంటే ప్రేమంట” చిత్ర ఆడియో రేపు(ఏప్రిల్ 29) విడుదల కానుంది. ఈ వేడుకకు అన్నపూర్ణ స్టూడియోస్,హైదరాబాద్ వేదిక కానుంది. ఏ కరుణాకరన్,జివి ప్రకాష్ మరియు స్రవంతి రవి కిషోర్ తో పాటు మరి కొంత మంది సిని ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. పాట చిత్రీకరణ నిమిత్తం బీదర్ లో ఉన్న రామ్ ఈరోజు హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఏ కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్ లో అత్యంత ఖరీదయిన చిత్రమయిన ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్రంలో రొమాంటిక్ చిత్రానికి ఉండవలసిన అన్ని అంశాలు పొందుపరిచినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు