నిలిచిపోయిన మహేష్ బాబు – సుకుమార్ చిత్రం చిత్రీకరణ

నిలిచిపోయిన మహేష్ బాబు – సుకుమార్ చిత్రం చిత్రీకరణ

Published on Apr 28, 2012 3:37 PM IST


సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు రాబోతున్న చిత్రం చిత్రీకరణ ఈరోజు నిలిపివేశారు. గత ఐదు రోజులుగా ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక్కడ మహేష్ బాబు మీద ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట చిత్రీకరణ సమయం లో మహేష్ బాబు స్వల్ప అనారోగ్య పాలయినట్టు సమాచారం. ఈ కారణంగా సుకుమార్ చిత్రీకరణ నిలిపివేసినట్టు తెలుస్తుంది ఈరోజు మహేష్ బాబు విశ్రాంతి తీసుకోనున్నారు. అభిమానులు భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం మహేష్ బాబు బానే ఉన్నారు. ముందుగానే అనుకున్నట్టు కాజల్ నిన్న చిత్ర బృందంతో కలిసింది ఈ పాట చిత్రీకరణ ఏప్రిల్ 30 వరకు జరగనుంది. అనిల్ సుంకర,ఆచంట రామ్ మరియు గోపీచంద్ లు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు