ఆలస్యం కానున్న సమంత బాలివుడ్ ఆరంగేట్రం?

ఆలస్యం కానున్న సమంత బాలివుడ్ ఆరంగేట్రం?

Published on Apr 27, 2012 1:15 AM IST

బాలివుడ్ లో అడుగుపెట్టాలన్న సమంత కల నెరవేరడం కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. కోలివుడ్ లో తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ మొదట్లో మూడు భాషల్లో చేద్దాం అనుకున్న “నీదానే ఎన్ పోన్ వసంతం(ఎటో వెళ్లిపోయింది మనసు)” చిత్రం ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో మాత్రమే చెయ్యాలని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రేక్షకుల స్పందన చూసి హిందీలో చిత్రం విడుదల చెయ్యనున్నారు. ఈ సంవత్సరం బాలివుడ్ లో విడుదలయిన “ఏక్ దీవానా థా” చిత్రం పరాజయం చవి చూడటంతో గౌతమ్ మీనన్ ఈ విషయాన్నీ మనసులో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్త్తుంది. సమంత “ఏక్ దీవాన థా” చిత్రంలో చిన్న పాత్ర చేసినా ఈ చిత్రం లో పూర్తి నిడివి ఉన్న పాత్ర చెయ్యాల్సి ఉంది. “అసి నబ్బె పూరే సౌ” అనే పేరుతో ఈ చిత్రం హిందీ లో రావాల్ల్సింది. ప్రస్త్తుతం చెన్నైలో ఈ చిత్ర చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు