యూరప్ బయల్దేరిన గబ్బర్ సింగ్ టీం

యూరప్ బయల్దేరిన గబ్బర్ సింగ్ టీం

Published on Apr 26, 2012 8:21 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్ర యూనిట్ ఈ రోజు ఉదయం యూరప్ బయల్దేరింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు సాయంత్రం అక్కడకి వెళ్లి రేపటి నుండి షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో చిత్రీకరించాల్సిన పాటలు ఇంకా రెండు మిగిలి ఉన్నాయి. ‘దిల్ సే’ మరియు ‘పిల్లా’ పాటల చిత్రీకరణ న్యూజిలాండ్ మరియు ఇతర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంభందించిన సినిమాటోగ్రాఫర్, కొరియోగ్రాఫర్ బృందం ముందే అక్కడికి చేరుకొని లోకేషన్లకు సంభందించిన పనులు శరవేగంగా జరుపుతున్నారు. శృతి హాసన్, సుహాసిని, అజయ్, గాయత్రి, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు