ఇండియాలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న “గబ్బర్ సింగ్ “

ఇండియాలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న “గబ్బర్ సింగ్ “

Published on Apr 25, 2012 10:23 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం “గబ్బర్ సింగ్” ఈరోజుతో ఇండియాలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. గత రెండు రోజులుగా “ఆకాశం అమ్మాయి అయితే” పాటకు పాచ్ వర్క్ జరుపుకున్న ఈ చిత్రం ఈ చిత్రీకరణ ముగించుకొని చిత్రంలో మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం యూరప్ పయనమవనున్నారు. ఇప్పటికే ఒక బృందం అక్కడకి చేరుకొని గబ్బర్ సింగ్ షెడ్యూల్ ని పర్యవేక్షిస్తుంది. ఈ పాటల చిత్రీకరణతో పాటు నిర్మాణేతర కార్యక్రమాలు సమాంతరంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం మే రెండవ వారంలో విడుదల కానుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే జనంలో మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు నిర్మిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు