త్వరలో విడుదల కాబోతున్న భాషా!

త్వరలో విడుదల కాబోతున్న భాషా!

Published on Apr 25, 2012 2:24 PM IST


అవును మీరు విన్నది నిజమే. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన భాషా చిత్రం మళ్లీ విడుదల కాబోతుంది. 1995లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రజిని చెప్పిన డైలాగ్స్ మ్యానరిజం అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిటల్ చేసి క్లారిటీ పెంచి మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటుగా తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. రజినీకాంత్ సరసన నగ్మా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసారు. దేవ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. రజినీకాంత్ ఈ సినిమాలో చెప్పిన ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే’ డైలాగ్ ఎంతటి సంచకనం సృష్టించిందో కూడా అందరికీ తెలిసిందే. రజినీకాంత్ అభిమానుల కోసం మళ్లీ ఈ సినిమా విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు