నాగార్జున – దశరథ్ ల చిత్రానికి పేరు ఖరారు?

నాగార్జున – దశరథ్ ల చిత్రానికి పేరు ఖరారు?

Published on Apr 25, 2012 12:24 AM IST


నాగార్జున-దశరథ్ ల కలయికలో రాబోతున్న చిత్రం పేరు “లవ్ స్టొరీ” అవబోతుందా? పరిశ్రమలో తిరుగుతున్న సమాచారం ప్రకారం నిజమనే అనిపిస్తుంది. ఈ పుకారులకు తమన్ చేసిన ట్వీట్ మరింత బలం చేకూర్చింది.” నాగార్జున గారితో మళ్ళి కలిసి పని చేస్తున్నాను దసరత్ గారి ఈ చిత్రం పేరు “లవ్ స్టొరీ” ” అని తమన్ ట్వీట్ చేశారు. నయనతార ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తుండగా అనిల్ భండారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శివ ప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో దశరథ్ – నాగార్జునల కలయికలో “సంతోషం” చిత్రం భారీ విజయం సాదించింది.

తాజా వార్తలు