చివరి దశల్లో దమ్ము పోస్ట్ ప్రొడక్షన్

చివరి దశల్లో దమ్ము పోస్ట్ ప్రొడక్షన్

Published on Apr 4, 2012 11:18 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దమ్ము’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్లో ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఎన్టీఆర్ దగ్గరుండి చేయిస్తున్నాడు. డిఐ (డిజిటల్ ఇంటర్మీడియట్) విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ చివరి వారంలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాన్డర్ వల్లభ నిర్మాత. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలవగా అన్ని పాటలు చాలా బావుండటంతో మాస్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

తాజా వార్తలు