వివి వినాయక్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రామ్ చరణ్

వివి వినాయక్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న రామ్ చరణ్

Published on Apr 1, 2012 6:38 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వివి వినాయక్ డైరెక్షన్లో తెరక్కుతున్న చిత్రం రెండవ షెడ్యుల్ ఈ రోజు ప్రారంభమైంది. హైదరాబాదులోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కాలేజ్లో ఈ చిత్రానికి సంభందించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్, కాజల్, బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యుల్ హైదరాబాదులోని పాత బస్తీలో జరిగింది. రామ్ చరణ్ పొల్లాచ్చిలో ఇటీవలే రచ్చ చిత్రానికి సంభందించిన ఒక పాట చిత్రీకరణలో పాల్గొన్నాడు. అమలా పాల్ సెకండ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు