మే లో విడుదల కానున్న “ఎందుకంటే ప్రేమంట” ఆడియో

మే లో విడుదల కానున్న “ఎందుకంటే ప్రేమంట” ఆడియో

Published on Mar 31, 2012 3:20 PM IST


రామ్ కెరీర్ లో “ఎందుకంటే ప్రేమంట” చిత్రం ముఖ్య పాత్ర పోషించనుంది. ఈ చిత్రంతో రామ్ తమిళంలో పరిచయం కాబోతున్నారు. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ మరియు తమన్నాలు జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. ఈ చిత్రం మే 31న విడుదల కానుందని ఈ మధ్య మేము ప్రచురించాము.ఈ చిత్ర ఆడియో మే మొదటి సగం లో విడుదల కానుంది. ఈ విషయం హీరో రామ్ వెల్లడించారు.జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో అన్ని పాటలు అద్బుతంగా వచ్చాయని అంటున్నారు. కరుణాకరన్ మరియు జి.వి.ప్రకాష్ గతంలో “ఉల్లాసంగా ఉత్సాహంగా” మరియు “డార్లింగ్” చిత్రాలకు కలిసి పని చేశారు. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదించాయి

తాజా వార్తలు