అనుష్క,ఆర్యల చిత్రానికి పేరు ఖరారు

అనుష్క,ఆర్యల చిత్రానికి పేరు ఖరారు

Published on Mar 30, 2012 8:44 PM IST

ఆర్య మరియు అనుష్క ప్రధాన పాత్రలలో సెల్వ రాఘవన్ (శ్రీ రాఘవ) ఒక ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చెయ్యబోతుంది. అనుష్క ఈ చిత్రంలో ఒక పాత్ర కోసం మార్షల్ ఆర్స్ట్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు పేరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ” బృందావనంలో నందకుమారుడు” అనే పేరు ని ఈ చిత్రానికి ఖరారు చేశారు. తమిళం లో “ఇరండాం ఉళగం” అనే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం గోవా లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తరువాత బ్రజిల్ పయనమవనున్నారు. ఈ చిత్రానికి హర్రిస్ జయరాజ్ సంగీతం అందించనున్నారు. “ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే” చిత్రం తరువాత శ్రీ రాఘవ నేరుగా చేస్తున్న తెలుగు చిత్రం ఇదే.

తాజా వార్తలు