గబ్బర్ సింగ్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా మలైకా పాట

గబ్బర్ సింగ్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా మలైకా పాట

Published on Mar 29, 2012 9:12 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తి చేసుకుంటూ చివరి దశకు చేరుకుంది. మే నెలలో విడుదల కానున్న ఈ సినిమాలో మున్నిగా మలైకా అరోరా ఖాన్ నర్తించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటలో నర్తించేందుకు గాను ఆమెకు భారీ అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ ఎంత అనుకుంటున్నారా, అక్షరాల కోటి రూపాయలు. అవును మలైకా ఈ ఐటెం సాంగ్లో చేయడానికి కోటి రూపాయలు తీసుకుంది. మలైకాకు ఎందుకు ఇంత క్రేజ్ అనుకుంటున్నారా, దబాంగ్ సినిమా పేరు చెబితే సల్మాన్ చేసిన యాక్షన్ సన్నివేశాల కంటే మలైకా చేసిన మున్ని పాటే ఎక్కువ గుర్తొస్తుంది మరి. సినిమా విజయంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది. ఈ పాట తెలుగులో కూడా ఒక ఊపు ఊపేస్తుందని నిర్మాత బండ్ల గణేష్ బాబు చెబుతున్నారు.

తాజా వార్తలు