షూటింగ్లో కళ్ళు తిరిగి పడిపోయిన బాలీవుడ్ హీరొయిన్

షూటింగ్లో కళ్ళు తిరిగి పడిపోయిన బాలీవుడ్ హీరొయిన్

Published on Mar 29, 2012 2:33 AM IST

ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ధోని సినిమాలో నటించిన రాధిక ఆప్టే మీకందరికీ గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు రక్త చరిత్ర సినిమాలో వివేక్ ఒబెరాయ్ భార్యగా నటించింది. ఆమె ఒక తమిళ్ సినిమా షూటింగ్లో ఉండగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ‘వేత్రి సెల్వన్’ అనే సినిమా ఊటీ దగ్గరలోని కేతి రైల్వే స్టేషన్లో షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్లో పాల్గొంటున్న ఆమె రాత్రి పూట షూటింగ్ జరుగుతుండటం, పై కప్పు భాగం లేకుండా షూటింగ్ జరగడంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెను దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లగా తరువాత ఆమె కోలుకుంది. ఈ సినిమాలో రంగం సినిమా ఫేం అజ్మల్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

తాజా వార్తలు