పవన్ కళ్యాణ్ సినిమాకి మున్నీ దొరికింది

పవన్ కళ్యాణ్ సినిమాకి మున్నీ దొరికింది

Published on Mar 27, 2012 3:35 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఐటెం సాంగ్లో డాన్స్ చేయడానికి మున్నీ దొరికింది. ఆమెవరో కాదు, మలైకా అరోరా ఖాన్. దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మున్నీ పాట కోసం ఎంతో మంది హీరోయిన్లని వెతికినప్పటికీ చివరికి హిందీ మున్నీ పాటలో చేసిన మలైకా అరోరా ఖాన్ ని ఖరారు చేసారు. ఈ పాట ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ పాటకి మున్నీ స్టెప్స్ కూడా తోడైతే మాస్ ఆడియెన్స్ కి పండగే. గబ్బర్ సింగ్ ఆడియో మే మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేసున్నారు. గబ్బర్ సింగ్ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు