షుమాకర్ కి హలో చెప్పిన సిద్దార్థ్

షుమాకర్ కి హలో చెప్పిన సిద్దార్థ్

Published on Mar 27, 2012 12:20 AM IST

ఎవరయినా మనకి బాగా నచ్చిన ప్రఖ్యాత వ్యక్తిని కలిస్తే మనం చాలా ఆనందపడుతం ఈ విషయం అందరి జీవితాలలో జరిగే విషయమే. అలాంటి ఒక అనుభవాన్నే సిద్దార్థ్ రుచి చూసారు. విషయంలోకి వెళ్తే ఈరోజు ప్రొద్దున దుబాయ్ విమానాశ్రయంలో విమానం కోసం వేచి చూస్తున్న సిద్దార్థ్ అక్కడికి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వరల్డ్ నెం 1 మైకేల్ షుమాకర్ కి హలో చెప్పారు. ” షుమాకర్ కి హలో చెప్పాను చాలా ఆనందంగా ఉంది . ఇలాంటి అనుభవం నేను అసలు ఊహించలేదు” అని ట్విట్టర్ లో చెప్పారు. మైకేల్ షుమకర్ మలేసియా లో సెపంగ్ గ్రాండ్ ఫ్రీలో పాల్గొన్నారు ఈ సంఘటన చోటు చేసుకునే సమయంలో ఆయన యూరోప్ కి వెళ్తూ ఉన్నారు

తాజా వార్తలు