చిన్నచిత్రాలను కాపాడుకోవటానికే మా ఈ “గోల గోల” – శివాజీ

చిన్నచిత్రాలను కాపాడుకోవటానికే మా ఈ “గోల గోల” – శివాజీ

Published on Mar 24, 2012 4:26 PM IST

శివాజీ మరియు గాయత్రి జంటగా నటిస్తున్న చిత్రం “గోల గోల”. ఈ చిత్రానికి శ్యాం దర్శకత్వం వహిస్తుండగా వై.రాణి మరియు విక్రం రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ ఈ మధ్యనే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపార వేత్త రవి ప్రకాష్ హాజరయ్యి లోగోని ఆవిష్కరించారు. ఈ “గోల గోల” చిత్రం చిన్న చిత్రాలలో కొత్త ఒరవడిని తీసుకురావాలని కోరుకుంటున్నా అని అయన అన్నారు. ఈ చిత్రం లో పని చేసిన ప్రతి ఒక్కరు భవిష్యత్తులో మంచి నటులుగా మిగిలిపోతారని.

చిన్న సినిమాలను కాపాడుకునేందుకు ఈ చిత్రాన్ని చేస్తున్నాం అని హీరో శివాజీ అన్నారు. నిర్మాతల్లో ఒకరయిన విక్రం రాజు మాట్లాడుతూ త్వరలో ఈ చిత్ర పాటలను మరియు వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నాం అని అన్నారు. దర్శకుడు శ్యామ్, రచయిత రాజాచంద్రవర్మ, కెమెరామేన్ బి.వాసు, గాయత్రి, జ్యోతి, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు