అల్ టైం టాప్ 5 లిస్టులో చోటు దక్కించుకున్న బిజినెస్ మేన్

అల్ టైం టాప్ 5 లిస్టులో చోటు దక్కించుకున్న బిజినెస్ మేన్

Published on Mar 23, 2012 3:49 AM IST

ప్రిన్స్ మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘బిజినెస్ మేన్’ తెలుగు చలన చిత్ర సీమలో ఒక టాప్ 5 గ్రాసర్స్ సరసన నిలిచింది. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రాలుగా అరుంధతి, దూకుడు, మగధీర, పోకిరి, రోబో వంటి చిత్రాలు ముందు వరుసలో ఉండేవి. ఈ చిత్ర నిర్మాతలు చివరి వసూళ్లు విడుదల చేయగా బిజినెస్ మేన్ టాప్ 5 లో నిలిచింది. మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి రోజున విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకుంటూ భారీ విజయం సాధించింది.

తాజా వార్తలు