రెబెల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న కృష్ణం రాజు

రెబెల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న కృష్ణం రాజు

Published on Mar 23, 2012 12:25 AM IST

రెబెల్ స్టార్ కృష్ణంరాజు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాబోతున్న చిత్రం “రెబెల్” లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. అన్ని సన్నివేశాలు పూర్తి చేసుకున్న కృష్ణంరాజు చిత్ర నిర్మాణేతర పనులు మొదలయ్యాక డబ్బింగ్ చెప్తారు. ఈ చిత్రం ప్రస్తుతం తమన్నా పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రాన్ని జే.భగవాన్ మరియు జే.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా మరియు దీక్ష సెత్ లు ఈ చిత్రం లో కథానాయికలుగా కనిపించబోతున్నారు. తమన్నా అనుష్క స్థానంలో ఈ చిత్రం లో చేస్తుంది. మొదట్లో తమన్ సంగీతం అందివ్వాల్సి ఉండగా అయన తప్పుకున్నారు ప్రస్తుతం లారెన్స్ స్వతంగా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారీగా చిత్రీకరించబడుతుంది.

తాజా వార్తలు