రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను: శాన్వి

రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఎంతో నేర్చుకున్నాను: శాన్వి

Published on Mar 21, 2012 2:12 PM IST


బి. జయ దర్శకత్వంలో ఆది హీరోగా నటిస్తున్న సినిమాలో శాన్వి హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె రాజేంద్ర ప్రసాద్ కూతురిగా నటిస్తుంది.ఆయనతో కలిసి పనిచేయడం ఆమెకు ఆనందంగా ఉందని శాన్వి అంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనుభవం ఉన్న నటుడు ఆయనతో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఆయన వద్ద నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ఈ సినిమాలో ఆయన నా పై చూపించిన ప్రేమ మరువలేనిది. ప్రముఖ పి.ఆర్.ఓ బిఎ రాజు ఈ చిత్రాన్ని నిర్మించగా మార్చి చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతుంది.

తాజా వార్తలు