ప్రత్యేకం : హిందీ లో పూల రంగడు!

ప్రత్యేకం : హిందీ లో పూల రంగడు!

Published on Mar 16, 2012 3:51 AM IST

మాకు అందిన ప్రత్యేక సమాచారం ప్రకారం ఈ మధ్య విడుదల అయ్యి భారి విజయం సాదించిన “పూల రంగడు” చిత్ర రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుగుతున్నాయి. బాలివుడ్ ప్రధాన నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన బాబా ఫిల్మ్స్ సంస్థ నిర్మాత అచ్చి రెడ్డి తో రీమేక్ హక్కుల గురించి చర్చలు జరుపుతున్నారు. హిందీ చిత్రం లో సునీల్ స్థానం లో అక్షయ్ కుమార్ ని నటింపజేయాలని ఆలోచనలో ఉన్నారు. తెలుగు చిత్రానికి వీరబద్రమ్ దర్శకత్వం వహించారు హిందీ చిత్రానికి కూడా ఈయననే దర్శకత్వం వహించమని కోరినట్టు సమాచారం ఇంకా ఏది నిర్ణయించలేదు సల్మాన్ ఖాన్ “వాంటెడ్” చిత్రం విజయం సాదించిన తరువాత తెలుగు చిత్ర రీమేక్ హక్కులు చాలా తొందరగా అమ్ముడుపోతున్నాయి. “వాంటెడ్” చిత్రం తెలుగు “పోకిరి” చిత్రానికి రీమేక్.

తాజా వార్తలు