ఆర్పీ పట్నాయక్ ఫేస్ బుక్ ఇప్పుడు “ఫ్రెండ్స్ బుక్”

ఆర్పీ పట్నాయక్ ఫేస్ బుక్ ఇప్పుడు “ఫ్రెండ్స్ బుక్”

Published on Mar 15, 2012 3:14 PM IST

ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “ఫేస్ బుక్” ఇప్పుడు “ఫ్రెండ్స్ బుక్” గా మారింది. పేరు మారిందని తెలియజేయటానికి ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ ” సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ల వల్ల మంచి -చెడు రెండు సమ పాళ్ళలో ఉంటాయి సరైన రీతిలో వినియోగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? తప్పు దార్లో వాడుకునేవారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? అనేదే ఈ చిత్ర కథా నేఫధ్యం” అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ” ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నాం నిజానికి ఫేస్ బుక్ సంస్థ నుండి మాకు ఎటువంటి సమస్య లేదు కాని విడుదల సమయం లో ఎటువంటి సమస్య ఎదుర్కొనకుండా ఉండటానికి పేరు ని “ఫ్రెండ్స్ బుక్” గా మారుస్తున్నాం” అని తెలిపారు.నిశ్చల్, ఉదయ్, సూర్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై మళ్ళ విజయప్రసాద్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు