మరోసారి కలిసి నటించనున్న గోపీచంద్ – తాప్సీ

మరోసారి కలిసి నటించనున్న గోపీచంద్ – తాప్సీ

Published on Mar 14, 2012 10:58 AM IST


గోపీచంద్ మరియు తాప్సీ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. చంద్ర శేఖర్ యేలేటి రూపొందించనున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించనున్నారు గతంలో వీరిద్దరు కలిసి కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన ‘మొగుడు’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మార్చి చివరి వారం నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ సంస్థతో 3 సినిమాలకు గాను ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెల్సిందే, అందులో ఒక చిత్రమే ఇది. ఈ చిత్రాన్ని జోర్డాన్, లడక్, రాజస్తాన్ లలో చిత్రీకరించనున్నారు. శ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు