కార్ చేసింగ్స్ చేస్తున్న ‘గబ్బర్ సింగ్’

కార్ చేసింగ్స్ చేస్తున్న ‘గబ్బర్ సింగ్’

Published on Mar 12, 2012 1:31 PM IST


పవర్ స్టార్ నటిస్తున్న మాస్ మసాల యాక్షన్ ఎంటర్టైనర్ ‘గబ్బర్ సింగ్’ ఈ ఏడాది మే నెలలో విడుదలకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర క్లైమాక్స్ భారీ స్థాయిలో హైదరాబాద్ మరియు విజయవాడ హైవే మీద చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాల్లో కార్ చేసింగ్ లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోలిస్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి హరిష శంకర్ దర్శకుడు. పరమేశ్వర ఆర్ట్స్ పతాకం పై బండ్ల గణేష్ బాబు నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు