నేను ప్రతి సినిమాకు ముందు నెర్వస్ గా ఫీలవుతాను: సమంతా

నేను ప్రతి సినిమాకు ముందు నెర్వస్ గా ఫీలవుతాను: సమంతా

Published on Mar 11, 2012 11:24 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో సమంతా ఒకరు. ఇటీవల ఆమె ఒక వార్త పత్రికతో మాట్లాడుతూ నేను ప్రతి సినిమా చేయబోయే ముందు నెర్వస్ గా ఫీలవుతాను. ఎందుకంటే నేను ప్రతి సినిమా బాగా చేయాలనీ అనుకుంటాను. ఆమె ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీటితో పాటు పలు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆమె తమిళంలో మణిరత్నం డైరెక్షన్లో ‘కాదల్’ గౌతం మీనన్ డైరెక్షన్లో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాల్లో నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.

తాజా వార్తలు