“రచ్చ” చిత్రీకరణ లో గాయపడ్డ రామ్ చరణ్

“రచ్చ” చిత్రీకరణ లో గాయపడ్డ రామ్ చరణ్

Published on Mar 10, 2012 2:52 PM IST


రామ్ చరణ్ తేజ “రచ్చ” షూటింగ్ లో గాయపడ్డారు ఈ ఘటన మూలంగా చిత్ర విడుదలకు ఆటంకం కలుగవచ్చు. ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పాట చిత్రీకరణ జరుపుతుండగా రామ్ చరణ్ కాలికి గాయమయ్యింది వైద్యులు పరీక్షించి 3 – 4 వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఈ చిత్రం లో ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది ఈ చిత్రం ఈ నెల చివర్లో కాని ఏప్రిల్ మొదట్లో కాని విడుదల చెయ్యాలని అనుకున్నారు. మార్చ్ 11న చిత్ర ఆడియో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా లో విడుదల కానుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్ వి ప్రసాద్ మరియు పరాస్ జైన్ లు మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ మరియు తమన్నా లు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు విడుదల తేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తాజా వార్తలు