కాల్గేట్ యాడ్స్ లో త్రిష స్థానం లో అనుష్క

కాల్గేట్ యాడ్స్ లో త్రిష స్థానం లో అనుష్క

Published on Mar 9, 2012 8:15 PM IST

“మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా?” అని టి వి రిపోర్టర్ గా త్రిషా చేసిన ప్రచార చిత్రాలు గుర్తుండే ఉంటాయి. ప్రస్తుతం తమిళ మరియు తెలుగు లో త్రిష స్థానం లో అనుష్క కనపడబోతుంది. చాలా కాలం పాటు కాల్గేట్ కి త్రిషా ప్రచార కర్త గా వ్యవహరించారు త్రిష తరువాత అల్లు అర్జున్ కాల్గేట్ ప్రచార కర్తగా వ్యవహరించారు ఇప్పుడు అనుష్క ఈ ప్రాడక్ట్ కి ప్రచారకర్తగా ఒప్పుకున్నారు జాతీయ ప్రాడక్ట్ లు ఈ మద్య స్థానిక నటుల తో ప్రచార చిత్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు మరియు తమిళం లో అనుష్క కి ఉన్న ప్రాచ్యుర్యం మూలాన అనుష్క కి ఈ అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ భామ తాండవం మరియు అలెక్స్ పాండియన్ అనే రెండు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

తాజా వార్తలు