బోయపాటి శ్రీను – మాస్ మనసు తెలిసిన దర్శకుడు

బోయపాటి శ్రీను – మాస్ మనసు తెలిసిన దర్శకుడు

Published on Mar 9, 2012 8:40 AM IST


తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎస్ ఎస్ రాజమౌళి తరువాత అంతటి విజయశాతం కలిగి ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. తన చివరి చిత్రం నందమూరి బాల కృష్ణ తో చేసిన “సింహ” బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అంతకముందు చేసిన రవి తేజ “భద్ర” మరియు వెంకటేష్ “తులసి” చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్లు బానే రాబట్టాయి ప్రస్తుతం ఈ దర్శకుడు జూనియర్ ఎన్ టి ఆర్ తో “దమ్ము” చిత్రం లో బిజీ గా ఉన్నారు. ఈ దర్శకుడు చిత్రం లో ఎంటర్ టైన్మెంట్ పళ్ళు ఎక్కువ ఉండేలా చూసుకుంటాడు. కథనం దెబ్బతినకుండా హీరోయిజం చూపిస్తారు. ఈ దర్శకుడి విజయ సూత్రం ఏంటని ఒకానొక నిర్మాతని అడుగగా అయన ఇలా చెప్పారు ” బోయపాటి శ్రీను చిత్ర కథనం లో మాస్ జనాన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తారు మాస్ కి నచ్చితే చిత్రం విజయం సాదించినట్టే” అని అన్నారు. ఏప్రిల్ 19న విడుదల కానున్న “దమ్ము” చిత్రం పై ఇపటికే చిత్ర వర్గాల్లో మంచి టాక్ నడుస్తుంది.

తాజా వార్తలు