ప్రసాద్ ల్యాబ్లో దమ్ము షూటింగ్

ప్రసాద్ ల్యాబ్లో దమ్ము షూటింగ్

Published on Mar 6, 2012 12:10 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన కీలక సన్నివేశాలు హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్రీకరించారు. ఎన్టీఆర్, త్రిషా మరియు ఇతర నటులపై ఈ సన్నివేశాలు చిత్రీకరించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు