విలన్ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను: మనోజ్

విలన్ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను: మనోజ్

Published on Mar 5, 2012 9:16 AM IST


మంచు మనోజ్ త్వరలో తన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ నూకయ్య’ తో మన ముందుకి రాబోతున్నాడు. ఈ చిత్రం మార్చి 8న విడుదలకు సిద్ధమవుతుంది. మొదటగా మిస్టర్ నోకియా అనే టైటిల్ అనుకున్నప్పటికీ సదరు నోకియా కంపెనీ నుండి కాపీ రైట్స్ సమస్యలు తలెత్తడంతో మిస్టర్ నూకయ్య గా మార్చాల్సి వచ్చింది. మనోజ్ తన సినిమాల్లో సాహసాలు చేయడానికి ఎప్పుడు ముందుంటాడు. అలాగే ప్రయోగాలూ చేయడాలు చేయడానికి కూడా వెనుకాడడు. ‘నేను మీకు తెలుసా’ మరియు ‘ప్రయాణం’ అతనిలోని నటుడిని మనం చూడొచ్చు. అదే విధంగా ‘వేదం’ చిత్రంలో అల్లు అర్జున్ తో నటించి, ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్రంలో బాలకృష్ణ తో నటిస్తూ మల్టి స్టారర్ చిత్రాలు చేయడంలో కూడా తను ముందుంటానని నిరూపించుకున్నాడు. విలన్ పాత్రలు చేయడమంటే తనకిష్టం అని త్వరలో విలన్ గా కనిపించే అవకాశం ఉందని అంటున్నాడు మనోజ్. కృతి ఖర్భంద, మరియు సన ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రాన్ని అని దర్శకత్వం వహించాడు.

తాజా వార్తలు